నందిగామ వైసీపీ కార్యాలయంలో శనివారం మాట్లాడిన నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, రాజకీయ ప్రత్యర్థుల దాడులు, వేధింపులకు వైసీపీ భయపడబోదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, 'సూపర్ సిక్స్' పథకాలపై ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని విమర్శించారు. వైసీపీ నేతలపై జరుగుతున్న రాజకీయ కక్షసాధింపు చర్యలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.