మొవ్వ: ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

మొవ్వ మండల పరిధిలోని వేములమడ గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు కూచిపూడి ఎస్సై కేఎన్. విశ్వనాథ్ బుధవారం రాత్రి తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 5200 నగదు స్వాధీన పరుచుకున్నట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలియజేస్తూ గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు పట్ల కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్