బంటుమల్లి: ఆర్టీసీ డ్రైవర్ పై దాడి.. నిందితులకు రిమాండ్

బంటుమిల్లిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, లేడీ కండక్టర్ పై దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి మచిలీపట్నం డీఎస్పీ రాజా మాట్లాడుతూ మే 4న బంటుమిల్లి వద్ద బస్సును అడ్డగించిన వెంకట నారాయణ, సతీశ్, శ్రీనివాసరావు బస్సులోకి వెళ్లి డ్రైవర్ నాగరాజు, లేడీ కండక్టర్ ను దూషించి కొట్టారు. మే 13న పోలీసులు వారిని అరెస్ట్ చేసి 15 రోజుల రిమాండుకు పంపారు. ఈ కేసు వివరాలను స్టేషన్లో వివరించారు.

సంబంధిత పోస్ట్