బంటుమిల్లి: నీట మునిగిన అర్తమూరు రోడ్లు

బంటుమిల్లి మండలం అర్తమూరులో రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అర్తమూరు నుంచి సాతులూరు వెళ్లే మార్గం నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్