బంటుమిల్లి మండలం పెందూరు వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ తల భాగం నుజ్జు అయిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.