విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆదివారం విధి నిర్వహణలో ఉన్న నున్న సీఐ అహ్మద్ అలీ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై, గుండెపోటుకు లోనయ్యారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల కథనం ప్రకారం, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.