మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గూడూరు పర్ణశాల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు, రోడ్డుపై వెళ్తున్న టిప్పర్ ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.