కృష్ణా జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృత్తివెన్ను మండలం మునిపెడకి చెందిన కాకర్ల ఫణి బంటుమిల్లి నుంచి మునిపెడ బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారు, బైక్ ఢీకొట్టుకున్న ఘటనలో ఫణి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.