కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండలం, చిన్న గొల్లపాలెం లో జరిగిన మామ అల్లుళ్ల హత్య కేసులో పది రోజులు గడిచిన దర్యాప్తులో పురోగతి కనిపించలేదు. ప్రత్యేక బృందాలతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. చిన్న గొల్లపాలెం మొత్తం పరిశీలించినప్పటికీ ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. ఈ జంట హత్యల కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.