పెడన పట్టణంలోని శివాలయం అగస్తేశ్వర స్వామి గుడి ముందు ఉన్న గాలిగోపురం మీద మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడింది. దేవాలయ గోపురం పైభాగం కొద్ది మేర దెబ్బతిని పెచ్చులూడిపడిపోయాయి. బుధవారం ఉదయాన్నే ఆలయ అర్చకులు పరిశీలించి కమిటీ ప్రతినిధులకు సమాచారం అందించారు. ముందు భాగం నుంచి పెచ్చులూడి పడిపోయాయి. భక్తులు ఇక్కడి పరిస్థితిని పరిశీలించటం కనిపించింది.