పెడన మండలం ఎస్. వి. పల్లిలో శనివారం కురిసిన భారీ వర్షాలకు రహదారులు అద్వాన్నంగా మారాయి. అంతర్గత రహదారులపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెడన పట్టణంలోని ప్రధాన రహదారుల్లోనూ వర్షపు నీరు నిలిచి ప్రయాణికులు, వాహనదారులకు అసౌకర్యం కలిగింది.