అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు..పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

అమెరికాలో వివాహం చేసుకున్న అనంతరం అదనపు కట్నం కోసం వేధింపులకు గురవుతున్నానని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం  ఫిర్యాదు చేసింది. వివాహ సమయంలో 60 సవర్ల బంగారం, 4 కిలోల వెండి కట్నంగా ఇచ్చినా, భర్త సందీప్, అత్తమామలు మరో రూ.50 లక్షలు కావాలని డిమాండ్ చేస్తూ తనను శారీరక, మానసిక, లైంగిక వేధింపులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్