ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ అనారోగ్య కారణాల వల్ల కంకిపాడులో సోమవారం జరిగే ఓ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు వీడియో విడుదల చేశారు. బాపులపాడుకు చెందిన పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్తె అన్విత ఇటీవల నీట్లో 202వ ర్యాంకు సాధించగా, ఆమెకు అభినందనలు తెలిపేందుకు బాబు మోహన్ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అన్విత సాధించిన ఆల్ ఇండియా ర్యాంక్ పట్ల బాబు మోహన్ అభినందనలు తెలిపారు.