పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని కంకిపాడు మండలంలోని శివారు ప్రాంతాలలో వరద నీరు ప్రవేశించి పంట పొలాలు నీటి ముంపులో మునిగి ఉన్నాయి. బుధవారం ఉదయం 6.50 లక్షల వరద నీరు దిగువకు విడుదల కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య పంటలు నీట మునిగాయని, మరలా వరద పెరిగితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.