కంకిపాడు: అంతర్రాష్ట్ర బైకు దొంగలు అరెస్ట్

అంతర్రాష్ట్ర బైకు దొంగలను కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కంకిపాడులో ఎస్పీ గంగాధర్ రావు మాట్లాడుతూ, ఐదు జిల్లాల పరిధిలో అంతర్రాష్ట్ర బైక్ దొంగలను అరెస్టు చేశామన్నారు. మహమ్మద్ రిజ్వాన్, కేసన సురేష్, షేక్ ఇబ్రహీం, కోలా కృష్ణారావు చెడు వ్యసనాలకు బానిసై ముఠాగా ఏర్పడి కళ్యాణ మండపాలు, గుడులు మసీదుల దగ్గర పార్క్ చేసిన బైకులను టార్గెట్ చేసి దొంగిలిస్తున్నారు. వారి నుంచి 50 బైకులను రికవరీ చేశారు.

సంబంధిత పోస్ట్