రైతు పోరు పేరుతో వైసీపీ నాయకులు చేస్తున్నది దొంగ ధర్నాలని ఉయ్యూరు, కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్లు కొండా ప్రవీణ్, అన్నే ధనరామకోటేశ్వరరావులు విమర్శించారు. మంగళవారం సాయంత్రం కంకిపాడులో మాట్లాడుతూ, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో వారం రోజుల్లో రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులోకి తెస్తుందని తెలిపారు. ఈ మేరకు తాము కృషి చేస్తున్నామని వివరించారు.