పెనమలూరు: గంగూరు హైవేపై ప్రమాదం - ఒకరి మృతి

పెనమలూరు నియోజకవర్గం గంగూరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. గంగూరు డీ మార్ట్ సమీపంలో వెళ్తున్న బైక్ ను టిప్పర్ లారీ ఢీ కొట్టగా, ద్విచక్రవాహనదారుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. డీ మార్ట్ సమీపంలో వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడంతో తరచూ ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్