పెనమలూరు: నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను

పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి తాడిగడప మున్సిపాలిటీలోని తాడిగడప కిలారు శ్రీరాములు కాలనీలో నూతన సీసీ రోడ్డును ప్రారంభించి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్