ఉయ్యూరు కెసిపి షుగర్ ఫ్యాక్టరీకి లోడు తీసుకువచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మన్నే సురేంద్రబాబు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు సైడ్ దిమ్మపై పడి మృతి చెందినట్లు చెబుతుండగా ఇది ముమ్మాటికి హత్య అని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఉయ్యూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.