పెనమలూరు: వెంకటరత్నంకు అభినందనలు తెలిపిన మంత్రి

పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం, చెప్పులు లేకుండా ఎండలో నడుస్తున్న స్కూల్ పిల్లలను చూసి చలించిపోయి, వారిని చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి చెప్పులు కొనిచ్చారు. ఈ సంఘటనను మంత్రి లోకేశ్ అభినందించారు. ఆదివారం ఆయన ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, 'పిల్లలు బహుమతిగా విసిరిన చిరునవ్వుతో హెడ్ కానిస్టేబుల్ ముఖంలో వెల్లివిరిసిన సంతృప్తి ఎంత గొప్పది! మీకు సెల్యూట్ వెంకటరత్నం గారు' అని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్