ఆర్థికంగా వెనుకబడిన వారికి సంక్షేమ పథకాలను అందించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శనివారం అసెంబ్లీలో సూచించారు. తన నియోజకవర్గంలో పేదల దుర్భర పరిస్థితులను ఆయన ఆవేదనతో వివరించారు. కొందరు ప్రభుత్వ పథకాలు పొందుతున్నా, వాటితో జీవనం సాగించలేకపోతున్నారని తెలిపారు.