పెనమలూరు మండలం గోశాలలో ముగ్గురు గంజాయి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. షేక్ బాజీ, చిన్న, ఓ బాలుడు కలిసి విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకువచ్చి విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు పోలీసులు మంగళవారం చెప్పారు. 3 సంచులలో గంజాయిని ఉంచగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.