తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులో నిమ్మకూరు ఆనందరావు అనే వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు. తలపై గాయాలతో ఇంటి ఆవరణలో విగత జీవిగా పడి ఉన్నాడు. ఆనందరావు మృతి విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న తోట్లవల్లూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆనందరావును కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని ఇరుగుపొరుగు వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు.