తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద కృష్ణానదిలో గోపి అనే యువకుడు శనివారం మృతి చెందాడు. కంకిపాడు మండలం మద్దూరుకు చెందిన గోపి రొయ్యూరులో పేకాట ఆడుతుండగా, పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో తప్పించుకోబోయి నదిలోని గుంతలో పడి మరణించాడు. గోపి మృతికి పోలీసుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.