ఉయ్యూరు సెంటర్ లో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం రాత్రి గండిగుంట వద్ద కారు ఢీకొన్న ఘటనలో శ్రీరాములు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు కారు యజమానిని నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇచ్చిన తరువాతే పోస్టుమార్టం చేయాలని, తమకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేశారు.