పిఆర్సీ కమిటీని నియమించాలి

యుటిఎఫ్ సభ్యత్వ క్యాంపెయిన్ లో భాగంగా తిరువూరులో యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి బి సి హెచ్ వి నారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం యుటిఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుంది అని అన్నారు. పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయాలని 30% ఐ. ఆర్ ప్రకటించాలని తెలిపారు. యుటిఎఫ్ చేపట్టిన సభ్యత్వ క్యాంపెయిన్ ఉపాధ్యాయుల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ చంటిబాబు, ఏ మురళీకృష్ణ, జిల్లా కౌన్సిలర్ కే రవిబాబు, వి రవి, ఇతర సంఘ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్