చింతల నర్వలో ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

గంపలగూడెం మండలం చింతలనర్వ గ్రామ పంచాయతీ పరిధిలో 95వ, 96వ అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం జాతీయ పోషకాహార మహోత్సవం నిర్వహించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తీసుకోవలసిన పోషకాహారం, ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లు మీనా కుమారి, శాంతి కుమారి, ఏఎన్ఎం. స్వప్న, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕