బలివాడ కాంతారావు జయంతి ఘనంగా నిర్వహణ

గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక బీసీ పాఠశాలలో శుక్రవారం, ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గ్రహీత బలివాడ కాంతారావు జయంతిని శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంతారావు ప్రజలను చైతన్య పరచుటకు 38 నవలలు, 400 చిన్నకథలు, 8 నాటకాలు, యాత్ర కథనాలు, వ్యాసాలు రచించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరసవెల్లి అనూష తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ మాజీ అధ్యక్షులు నంబూరి శ్రీనివాసరావు, సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, సిఆర్పి సంగెపు చిన్న నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్