పెనుగొలనులో 25 మంది క్రీడాకారులకు దుస్తులు పంపిణీ

గంపలగూడెం మండలం పెనుగొలనులో శుక్రవారం రాత్రి 25 మంది క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. పెనుగొలనుకు  చెందిన కబడ్డీ, క్రికెట్ క్రీడాకారులు వివిధ చోట్లప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి ఆర్థిక సహకారంతో దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, ఇనపనూరి శంకరరావు, గ్రామస్తులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕