చిన్నారులకు నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ

తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, పెనుగొలనులో సోమవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నులి పురుగుల నివారణ కోసం 'అల్బెండజోల్' మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ షేక్ సుల్తానా, ఏఎన్ఎం రత్నమాల, టీచర్ కే. లింగమ్మ, ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕