గ్రంథాలయం లో ప్రముఖ వైద్యులు చందర్రాయ్ జయంతి వేడుకలు

గంపలగూడెం మండలం పెనుగొలను గ్రంథాలయంలో బుధవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ వైద్యులు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైద్యుడిగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా జులై ఒకటవ తేదీన ఆయన జయంతిని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్