తిరువూరులో అగ్నిప్రమాదం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని జైభావి సెంటర్ నాగార్జున జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి ఫోటో ఫ్రేమ్స్ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕