గంపలగూడెం: 7వ రోజుకు చేరుకున్న గణపతి ఉత్సవాలు

గంపలగూడెం మండలంలో పలు గ్రామాల్లో గణపతి ఉత్సవాలు ఆదివారం 7వ రోజుకు చేరుకున్నాయి. మండలంలోని పెనుగొలను శ్రీ రంగనాయక స్వామి ఆలయ వెనుక పందిరిలో ఆలయ అర్చకులు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు దంపతులు ఈ పూజలో పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న దంపతులకు నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీకృష్ణార్జునుల ఫోటోలు అందజేశారు. ఈనెల 22వ తేదీ మంగళవారం స్వామి వారి కళ్యాణం, అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕