విస్సన్నపేటలో శనివారం గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. వారు తెలిపిన వివరణ ప్రకారం ఒక యువకుడి దగ్గర నుండి ఒక కేజీ 40 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నమన్నారు. రాబడిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తూండగా యువకుడు బైక్ పై నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే పట్టుకున్నామన్నారు. దీంతో కేసు నమోదు చేసి అతని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.