ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆర్డీవో కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఐసిడియస్ విధులతో పాటు ఎస్ఐఆర్ పని భారం మోయలేమని, తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని సంఘం నేతలు ఆర్డీవోకు వినతిపత్రం సోమవారం అందజేశారు. ఈ నిరసనలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు.