విశ్రాంత ప్రధానోపాధ్యాయులు యన్నం రంగారెడ్డి (84) కన్నుమూత

గంపలగూడెం మండలం పెనుగొలనుకు చెందిన విశ్రాంత హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు యన్నం రంగారెడ్డి (84) సోమవారం ఉదయం హైదరాబాదులో అనారోగ్య కారణాలతో మరణించారు. ఆయన గత కొంతకాలంగా తన కుమారుడు వద్ద ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక హైస్కూళ్లలో ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్న రంగారెడ్డి, ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను బోధించారని సాయిబాబా కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్