తిరువూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో "ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మె నిర్వహించారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని నినాదాలు చేశారు. షరతులు లేకుండా ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వయోపరిమితి 62 ఏళ్ళకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.