వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్లు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా అహర్నిశలు పోరాడిన వీర వనితగా ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని టీచర్ కే. లింగమ్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕