విస్సన్నపేట మండలం పుట్రేలలో వెల్లంకి నవీన్ అనే యువకుడు శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు తిరువూరు సీఐ గిరిబాబు, ఎస్ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.