విజయవాడ సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ బుధవారం తో ముగియనుంది. విచారణ అనంతరం ఆయనను సిట్ విజయవాడ కోర్టులో హాజరుపరచనుంది. ఇదే కేసులో కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యలను నేటి నుంచి 5 రోజులు కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది. విచారణలో సీఐ నాగరాజు కీలక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.