ఉద్యోగం పేరుతో ఘరానా మోసం

కంచికచర్ల మండలం ఘని అత్కూరుకు చెందిన వేంపరాల త్రి సాయి (26) వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా సంప్రదించి అతని ఖాతా నుండి రూ.2 లక్షలు తీసుకున్నారు. అనంతరం వారు స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్