మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు మేఘన ఫిర్యాదు చేసిన గృహహింస, వరకట్న వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జోగి రమేశ్ కుటుంబ సభ్యులు సహా మొత్తం 11 మంది విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం పరిశీలించారు. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు.