క్రైస్తవులపై దాడుల నివారణకు గవర్నర్‌కు వినతి

నవిజయవాడలో యూసీపీఐసీ చైర్మన్ డాక్టర్ కోలా ప్రసాద్ నేతృత్వంలోని బృందం బుధవారం గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. క్రైస్తవులపై దాడులు, చర్చిల కూల్చివేతలు, మరియు తప్పుడు కేసులను అరికట్టాలని వారు కోరారు. అలాగే చర్చి మరమ్మతులకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం, పాస్టర్ల గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుండి రూ. 10 వేలకు పెంచాలని విన్నవించారు. రాజ్యాంగబద్ధమైన మత స్వేచ్ఛ, సమానత్వం, మరియు భద్రతను కాపాడాలని ఈ సందర్భంగా కోలా ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕