శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాలకృష్ణారావు అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ ఈవో కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ ఈవో గారు అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం మరియు చిత్రపటం అందజేసినారు.