అమరావతికి భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం వేధిస్తోంది..

అమరావతికి భూములివ్వని రైతులను ప్రభుత్వం వేధిస్తోందని సోమవారం వైసీపీ సీఆర్డీయే పరిరక్షణ కమిటీ సభ్యుడు దేవినేని అవినాశ్ ఆరోపించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, పెనుమాక రైతుల ఆహ్వానం మేరకే తాము అక్కడికి వెళ్లామని స్పష్టం చేశారు. వైసీపీ అమరావతికి వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తోందని, తాము అమరావతికి వెళ్లి తీరుతామని ఆయన తేల్చి చెప్పారు.

సంబంధిత పోస్ట్