ప్రకాశం బ్యారేజ్ కు వచ్చే పర్యాటకులు ఆదమరిస్తే అంతే

విజయవాడ ప్రకాశం బ్యారేజీ రక్షణ గోడ దెబ్బతినడంతో సందర్శకులు భయాందోళనలకు గురవుతున్నారు. వారాంతాల్లో ఎక్కువగా ప్రకాశం బ్యారేజిపైకి సందర్శకులు వస్తుంటారు. సెల్ఫీలు తీసుకుంటూ నది ప్రవాహాన్ని వీక్షిస్తారు. కొంచెం ఆదమరుపుగా ఉన్నా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. గురువారం సీతానగరం వైపు ఉన్న రక్షణ గోడ నదిలోకి కుంగిపోతోంది. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసినా రెయిలింగ్ వంగి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది.

సంబంధిత పోస్ట్