విజయవాడ జాతీయ రహదారిపై ఆత్కూరు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విజయవాడకు చెందిన రాజ్, నూతన్కి శ్రీనివాస్ గా గుర్తించినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. మృతులు కారుతో ఎదురుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద దృశ్యాలు భయంకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.