విజయవాడ ఎన్ఎచ్-16 రామలింగేశ్వర నగర్ ఫ్లై ఓవర్ పై ఓ ప్రేమజంట మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించారు. విజయవాడ - ఒడిశా జాతీయ రహదారిపై వారి ప్రవర్తన తోటి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఈ జంటపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.