అదానీ స్మార్ట్ మీటర్లు తక్షణమే రద్దు చేయాలని సీపీఎం నగర సభ్యులు పీరు సాహెబ్ అన్నారు. బుధవారం విజయవాడ వాంబే కాలనీలోని ఓ ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న నేపథ్యంలో సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అబద్ధాలు చెప్పి స్మార్ట్ మీటర్లు పెట్టి మన నెత్తిన బారాలు వేయటానికి ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన అన్నారు.