విజయవాడకు చెందిన ఒక బాలికకు, కోదాడకు చెందిన అశోక్ అనే వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బాలికను కోదాడకు పిలిపించుకొని అత్యాచారం చేశాడు. ఇటీవల బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా, ఆమె 5 నెలల గర్భవతి అని తేలింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.